ప్రధమార్ధం కాస్త బోరింగ్ గా ఉన్నా.. సెకండాఫ్ మాత్రం సూపర్బ్

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో ఎవరా అంటే ఎలాంటి సందేహం లేకుండా అందరూ చెప్పే సమాధానం “అక్షయ్ కుమార్”. అక్షయ్ కి ఒక ఫ్లాప్ పడి చాలా ఏళ్ళవుతోంది. ఈమధ్యకాలంలో మనోడు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా తయారైంది. చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక 100 కోట్లు సాధిస్తోంది. ఆ తరహాలోనే అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం “కేసరి” కూడా బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతోంది. 1890 కాలంలో 21 మంది సిక్కులు 10,000 మంది ముస్లిం సైన్యం వారి మీదకి దండెత్తినప్పుడు.. ధైర్యంగా వాళ్ళు ఎలా ధైర్యంగా ఎదిరించారనేది కథాంశం.

ఫస్టాఫ్ లో సరైన ఎమోషన్ లేక కాస్త బోర్ కొట్టినప్పటికీ సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా 20 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ అద్భుతమనే చెప్పాలి. సిక్కు సైనికుల ధైర్యాన్ని, పోరాట పటిమను అత్యద్భుతంగా ప్రొజెక్ట్ చేశాడు దర్శకుడు. ఇక అక్షయ్ కుమార్ తోపాటు సైనికులుగా నటించిన 20 మంది నటులు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నారు. సో, బాలీవుడ్ కి ఈవారం మరో హిట్ దొరికినట్లే.

Share.