హలో చిత్రంలో రెండో హీరోయిన్ ఫిక్స్!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘హలో’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా మలయాళ  సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఆమెతో పాటు మరో భామ కూడా ఈ చిత్రంలో అఖిల్ సరసన నటిస్తున్నట్లు తెలిసింది. సెకండ్ హీరోయిన్ గా  నివేదితను చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సమాచారం.

జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘మగలిర్‌ మత్తుమ్‌’ అనే చిత్రంలో నివేదిత అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇందులోనూ ఆమెది నటన ప్రాధాన్యమున్న పాత్ర అయి ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ లో హలో టీజర్ ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అన్నపూర్ణ బ్యానర్లో భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.