రోమాంటిక్ ఫిలిమ్ తో వస్తున్న ఆకాష్ పురి

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ కథానాయకుడిగా సెకండ్ ఫిలిమ్ ఇవాళ మొదలైంది. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజునుంచి జరుపుకుంటుంది.. ఈ చిత్రం లో ఆకాష్ సరికొత్త లుక్, స్టైలిష్ గా లో కనిపించనున్నాడు..రొమాంటిక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి పూరి జగన్నాధ్ కథ, స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం.. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

akash-puri-next-film-titled-as-romantic1

akash-puri-next-film-titled-as-romantic2

మరి మంచి ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ చేస్తే అచ్చిరాలేదన్న బాధతో.. ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడేమో కానీ.. ఆకాష్ కళ్ళల్లో ఉండే ఇంటెన్సిటీకి మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తే యువ కథానాయకుల రేస్ లో నిలవగల సత్తా ఉన్న నటుడు ఆకాష్. మరి ఈ సెకండ్ సినిమాతో అయినా హీరోగా తన స్టామినా చాటుకుంటాడో లేదో చూడాలి. పూరీ ఫ్యాన్స్ & సినిమా ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఆకాష్ సక్సెస్ అవ్వాలని కోరుకొంటున్నాయి.

Share.