టాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన అజయ్‌ ఘోష్‌

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన  ‘జ్యోతిలక్ష్మి’లో విలన్ గా నటించిన అజయ్‌ ఘోష్‌ టాలీవుడ్ పై విమర్శలు గుప్పించారు. రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ సినిమా వేడుకలో ఆయన తెలుగు ప్రజలను, దర్శకులను చులకన చేసి మాట్లాడారు. తెలుగు దర్శకులకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఫోజులివ్వడం తప్ప ఏమి రాదని విమర్శించారు. తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కెమెరా ముందే కాకుండా, కెమెరా వెనుక కూడా నటించాలని చెప్పాడు. తమిళ సినీ పరిశ్రమ ముందు తెలుగు సినీ ఇండస్ట్రీ ఎందుకూ పనికిరాదని కోలీవుడ్ ని అభినందనల్లో ముంచెత్తాడు. అంతేకాదు అక్కడి ప్రజలను కూడా కాకా పట్టే విధంగా మాట్లాడాడు.

తమిళనాడులో ఆటో డ్రైవర్‌ కూడా పేపర్‌ చదువుతూ కనబడతాడని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గుట్కా, పాన్‌ నములుతూ కూర్చుంటారని అవహేళన చేసాడు. అలాగే తమిళ సాంబారు అమృతంలా ఉంటుందని, తెలుగువారు చేసే సాంబారు రుచి చూస్తే కడుపునొప్పి వస్తాయని మాట్లాడాడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న అజయ్‌ ఘోష్‌ మాటలు టాలీవుడ్ లో దుమారం లేపాయి. ఫిలిం నగర్లో ఎక్కడ చూసినా అజయ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. అజయ్‌ ఘోష్‌ విమర్శలు నిజమని తేలితే తెలుగు చిత్ర పరిశ్రమ అతనిపై జీవితకాల నిషేధం విధించనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.