అజ్ఞాతవాసిలో హైలెట్స్ ఇవే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగానైనా పాతిక చిత్రాల మైలు రాయికి చేరుకున్నారు. అతని కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా నిలిచే అజ్ఞాతవాసి సినిమా మరో కొన్ని గంటల్లో అమెరికాలో ప్రదర్శించనున్నారు. ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హైలెట్స్…

1. మేనరిజమ్స్ Agnyaathavaasiపవన్ కళ్యాణ్ లో అభిమానులకు నచ్చే మొట్టమొదటి అంశము మేనరిజం. మెడపైకి చేతిని తీసుకెళ్లే మేనరిజం అయితే అందరికీ ఇష్టం. అటువంటి మేనరిజమ్స్ అజ్ఞాతవాసిలో ఎన్నో ఉన్నాయి.

2. హాస్యం Agnyaathavaasiస్టార్ హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వెండితెరపై చిలిపి పనులతో నవ్వులు పూయిస్తుంటారు అజ్ఞాతవాసిలోనూ పవన్ తనదైన స్టైల్లో అమ్మాయిలను ఇమిటేట్ చేస్తూ కామెడీ పండించారు.

3. డైలాగ్స్ Agnyaathavaasiత్రివిక్రమ్ డైరెక్షన్ కి వంకలు పెట్టవచ్చేమో గానీ డైలాగ్స్ ని తప్పుపట్టలేము. ఇది వరకు చిత్రాల మాదిరిగానే ఇందులోనూ ఎన్నో బాగా పేలే డైలాగ్స్ ఉన్నాయి.

4. ఫిలాసఫీAgnyaathavaasi “జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే ఉంటుంది”.. వంటి అనేక జీవిత సత్యాలు మనకి అర్ధమైన భాషలో త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ నోటి నుంచి చెప్పించారు.

5. శర్మ, వర్మ కామెడీ Agnyaathavaasiప్రముఖ నటులు మురళి శర్మ, రావు రమేష్ లు శర్మ, వర్మ పాత్రల్లో హాస్యం వడ్డించనున్నారు.

6. యాక్షన్ Agnyaathavaasiమాస్ అభిమానులను అలరించే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ అజ్ఞాతవాసిలో ఎక్కువగా ఉన్నాయని టీజర్, ట్రైలర్ చెప్పకనే చెప్పాయి.

7. భారీ తారాగణం Agnyaathavaasiఅజ్ఞాతవాసిలో అనేక మంది సీనియర్ నటీనటులు ఉన్నారు. కుష్బూ కీలకరోల్ పోషించగా, బోమన్ ఇరానీ ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఇంద్రజ కూడా సెంటిమెంట్ తో కట్టిపడేయనుంది. ఇంకా ఆది, పరాగ్ త్యాగి, వెన్నెల కిషోర్, సంపత్ తో పాటు విక్టరీ వెంకటేష్ సినిమాకి బలం కానున్నారు.

8. రొమాన్స్ Agnyaathavaasiబద్రి సినిమా నుంచి పవన్ కళ్యాణ్ అంటే రొమాన్స్ ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు. ఆలా కోరుకునేవారిని నిరుత్సాహపడకుండా పవన్ కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ తో రొమాన్స్ చేయనున్నారు.

9. సంగీతం Agnyaathavaasiఅనిరుద్ కి అజ్ఞాతవాసి తొలి తెలుగు సినిమా అయినప్పటికీ.. తెలుగువారి నాడి పట్టుకున్నారు. తెలుగులోనూ పాటలు పాడి ఆకట్టుకున్నారు. నేపథ్య సంగీతంతోను కంటతడి పెట్టించనున్నారు.

10. సినిమాటోగ్రఫీ Agnyaathavaasiహిందీ, తమిళ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మణికందన్ తన కెమెరా కన్నుతో అజ్ఞాతవాసి ని అందంగా, అద్భుతంగా చూపించనున్నారు.

ఇవే కాకుండా పవన్ ఫ్యాన్స్ ని అలరించే అన్నిఅంశాలు అజ్ఞాతవాసిలో ఉన్నాయి.

Share.