అజ్ణాతవాసిలో అదరగొట్టే డైలాగ్స్ ఇవే

ఒక దర్శకుడిగా కంటే రచయితగా త్రివిక్రమ్ కి ఉన్న పేరు, ప్రఖ్యాతులు ఎక్కువ. కేవలం ఆయన రాసే సంభాషణల కోసమే థియేటర్లకి వెళ్ళే జనాలు లక్షల సంఖ్యలో ఉన్నారు. అందుకే త్రివిక్రమ్ ను గౌరవంతో “గురూజీ” అని పిలుచుకొంటారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “అజ్ణాతవాసి” నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. త్రివిక్రమ్ మాత్రం తనదైన శైలి సంభాషణలతో మరోసారి తనను మాటల మాంత్రికుడు అని ఎందుకు అంటారో నిరూపించుకొన్నాడు. ఆ సినిమాలోని కొన్ని అద్భుతమైన సంభాషణలు మీకోసం..

1. కుందేళ్లు అన్ని కులాసాగా తిరుగుతున్నాయి, సింహం సరదాగా వచ్చేయొచ్చు.Agnyatavaasi

2. ఒక ఆయుధం తయారు చెయ్యాలంటే ఒక చెయ్యి కావాలి ఒక ఆలోచన కావాలి ఒక స్వార్ధం కావాలి కానీ విధ్వంసం రావాలంటే ఒక అన్యాయం జరగాలి.Agnyatavaasi

3. నేను పెంచింది మాములు మనిషిని కాదు, ఒక యుద్ధం అంత విధ్వంసాన్ని , నడిచే మారణాయుద్ధాన్ని.Agnyatavaasi

4. విచ్చలవిడిగా నరికితే హింస , విచక్షణతో నరికితే ధర్మం.Agnyatavaasi

5. ఒకడికి ఆకలి వేస్తుంది అంటే ఎందుకు అని అడగరు, అదే అధికారం కావాలి అని అడిగితే ఎందుకు అని అడుగుతారు. ఎందుకు?Agnyatavaasi

6. ఎప్పుడూ జరిగేదాన్ని అనుభవం అంటారు ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు.Agnyatavaasi

7. మనుషులకు ఇంకొకడు సంపాదించిన డబ్బు అంటే ఎందుకు అంత ఆశ?Agnyatavaasi

8. రాజ్యం మీద ఆశ లేని వాటికంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు?Agnyatavaasi

9. ఇన్ఫర్మేషన్ మొత్తం ఐఫోన్ లోను జీవితం మొత్తం గూగుల్ లో పెట్టేసినట్టు ఉన్నారు.Agnyatavaasi

10. చిన్న పిల్లలు ఆకలితో ఉన్న ఆడపిల్లలు ఏడ్చినా ఈ దేశం బాగుపడదు అండి.Agnyatavaasi

11. విందా మీలాగే మాములు మనిషి కానీ అతని ఆశయం మాత్రం సాయంకాలం నీడ లాగా చాలా పెద్దది.Agnyatavaasi

12. ఎవడో వచ్చి విందా నాకు బాబు నేను విందాకి బాబు అంటే దా ఇందా కూర్చో అంటామా?Agnyatavaasi

13. విమానం ఎక్కిన ప్రతివాడు ఎగురుతున్నాం అనుకుంటాడు కానీ నిజానికి విమానం ఒక్కటే ఎగురుతుంది మనం కూర్చుంటాం అంతే
అలాగే ఈ ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తది , తెలవదు..! అనిపిస్తది అంతే.Agnyatavaasi

14. మా నాన్న మూసిన తలుపులకు అవతల చనిపోయిన మీ అన్నయ్యనే చూస్తున్నావ్
ఆయన బ్రతికించిన కుటుంబాలని వెలిగించిన దీపాల్ని నువ్వు చూడట్లేదు, చూడలేదు, చూడలేవు.Agnyatavaasi

Share.