మా సభ్యులందరూ సోంబేరిలైపోవాలి : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

ప్రముఖ సీనీ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఈమధ్య కాలంలో ఏం మాట్లాడినా ఓ సంచలనమవుతుంది. ఇక తాజాగా కొత్త ‘మా’ అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న… బాలసుబ్రహ్మణ్యం కొన్ని సంచలన కామెంట్లు చేసారు. ఈ కార్యక్రమంలో బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ” ‘మా’ కు సంబందించిన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ నేను పాల్గొనలేదు. అందుకు నిజంగా సిగ్గుగా ఉంది.

ఇప్పటివరకూ రానందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను… నేను మెంబర్ షీప్ కట్టానో లేదో కూడా నాకు తెలీదు. ఇక ఇప్పుడు కడతాను.. పెనాల్టీ తో సహా కట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్నికలు ఫలితాలు ఏవైనా సరే అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంతో ఉండాలి ఎవరికీ ఎలాంటి కష్టం రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ.. సభ్యుల్లో అందరూ కూడా సోంబేరిలు అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇక ఎప్పుడైనా ఎవరికైనా కొంత కష్టం వస్తే అందరూ ముందుండి నిలబడాలని ఒక సినీ ఇండస్ట్రీలో వ్యక్తిగా నేను కూడా సపోర్ట్ గా ఉంటాను అవసరమైతే సభ్యులు నన్ను డిమాండ్ చేయొచ్చు” అంటూ బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. ఇక్కడ మెంబర్ షిప్ ఉందో.. లేదో అంటూనే… అవసరమైతే ఫెనాల్టీ వేసి కట్టించుకోండి అనే మాట బాలు గారు వాడారో లేదో ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. ‘అంత నిర్లక్ష్యం ఏంటి అని కొందరు.. అలాగే బాలుగారికి డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share.