మరోసారి ట్రోల్స్ కి గురవుతున్న రష్మిక… కారణం అదే..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇక ‘గీత గోవిందం’ చిత్రం తరువాత రష్మిక మందన మరోసారి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ టీజర్లో విజయ్, రష్మిక ల లిప్ లాక్ సీన్ ఒకటి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.

ఇక ఈ టీజర్ కు అన్ని భాషల నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కన్నడ ప్రేక్షకులు మాత్రం టీజర్ పై ఫైర్ అవుతున్నారట. ఇందుకు ముఖ్య కారణం రక్షిత్ శెట్టి అనే చెప్పాలి. గతంలో రష్మిక కు కన్నడ హీరో రక్షిత్ శెట్టి కి నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే అది పెళ్ళి వరకూ వెళ్ళలేదు. దీంతో రష్మికపై రక్షిత్ ఫ్యాన్స్ ఛాన్స్ దొరికిన ప్రతీసారి ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ‘డియర్ కామ్రేడ్’ టీజర్లో రష్మిక – విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ ఉండడం.. రక్షిత్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదట. ఈ కారణంగానే ఆమె పై ట్రోల్స్ చేస్తునట్టు స్పష్టమవుతుంది. మరి ఈ కామెంట్స్ పై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..!

Share.