మళ్ళీ పోస్ట్ పోన్ అయిన అర్జున్ సురవరం

ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే నిఖిల్ ఒక్కసారిగా స్లో అయిపోయాడు. ముఖ్యంగా.. చాలా ఆశలు పెట్టుకొన్న “కిరాక్ పార్టీ” బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆ తర్వాత రిలీజ్ చేద్దామనుకున్న “ముద్ర” అలియాస్ “అర్జున్ సురవరం” చిత్రానికి రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. మొదట షూటింగ్ కంప్లీట్ అవ్వక కొన్నాళ్లు, తర్వాత టైటిల్ విషయంలో రచ్చ జరిగి ఇంకొన్నాళ్లు సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 29న విడుదల అని డేట్ ప్రకటించి ప్రమోషన్స్ మొదలెట్టారు.

మళ్ళీ ఏమైందో తెలియదు కానీ సినిమా రిలీజ్ మార్చి 29 నుంచి మళ్ళీ మార్చారని తెలుస్తోంది. అందుకు కారణాలు ఏమిటనేవి తెలియవు కానీ.. ప్రస్తుతానికి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఏమిటనేది కూడా క్లారిటీ లేదు. ఇలా ఇన్నిసార్లు “అర్జున్ సురవరం” పోస్ట్ పోన్ అయ్యేసరికి నిఖిల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి కూడా సినిమా మీద నమ్మకం పోయింది. ఇలాగే ఇంకోసారి పోస్ట్ పోన్ అయితే.. తర్వాత విడుదలైన తర్వాత కూడా సినిమాని జనాలు పట్టించుకొనే అవకాశం లేకుండాపోతుంది. మరి నిఖిల్ ఇప్పటికైనా జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

Share.