కొత్త కారుతో యాక్సిడెంట్ చేసిన రష్మీ, యువకుడి పరిస్థితి విషమం

సోషల్ మీడియాలోకంటే యూట్యూబ్ లో ఎప్పుడూ ఏదో ఒక వీడియోలో వైరల్ అవుతూ కనిపించే రష్మీ.. నిన్న ఓ యాక్సిడెంట్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇటీవల కొత్త కారు కొనుక్కున్న రష్మీ.. వైజాగ్ లోని తన ఇంటికి వెళ్లింది. అక్కడ తన కారు తానే డ్రైవ్ చేస్తుండగా.. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుద్దేసింది. కారు కంట్రోల్ తప్పిందా లేదా ఆ వ్యక్తి ఆమెకి అడ్డంగా వచ్చాడా అనేది తెలియదు కానీ.. ఆ వ్యక్తిని తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కి తరళించారు. ఈ విషయమై పోలీస్ కేస్ నమోదైంది. ప్రస్తుతం పోళీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాకపోతే.. రష్మీ ఈ యాక్సిడెంట్ విషయంలో అందరిలా భయపడి పారిపోలేదు. ఆ వ్యక్తి పొజిషన్ సెట్ అయ్యేవరకూ అతడితోనే ఉందని సమాచారం. ఒకవేళ అంతా సరిగ్గా జరిగితే.. రష్మీకి ఈ కేస్ విషయంలో క్లీన్ చిట్ వస్తుంది.

anchor-rashmi-car-accident-in-visakhapatnam1

నిన్నమొన్నటివరకూ డబ్బుల కోసం టీవీ షోస్ తోపాటు బీగ్రేడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోయిన రష్మీ ఇప్పుడు కేవలం టీవీ షోస్ కి మాత్రమే పరిమితమయ్యింది. ఈమధ్యకాలంలో ట్విట్టర్ లోను బాగా యాక్టివ్ గా ఉంటున్న రష్మీ.. అక్కడ ఇచ్చే రిప్లైస్ తోనే జనాల్ని బాగా ఆకట్టుకొంటోంది.

Share.