అల్లు అరవింద్ నిర్మాణంలో చరణ్ మూవీ ఫిక్స్..?

రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్,ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. జూ. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నాడు. చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. 2020 జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 350-400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమవుతుంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రం చేస్తూనే చరణ్ మరో చిత్రం చేయడానికి కూడా రెడీ అవుతున్నాడని తాజా సమాచారం. ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రూపొందించిన కొన్ని సినిమాలకి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వస్తున్న ఓ యువకుడు రాంచరణ్ కు ఓ లైన్ వినిపించాడట. ఈ లైన్ చరణ్ కి కూడా నచ్చడంతో.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో తన పోర్షన్ పూర్తయ్యేలోగా.. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచమని ఆ యువ దర్శకుడికి చరణ్ చెప్పాడట. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని… సంక్రాంతి నుండీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Share.