‘ఆర్.ఎక్స్.100’ డైరెక్టర్ తో ‘చైసామ్’ సినిమా..?

‘చైసామ్’ ఈ జంటకి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ‘ఏమాయ చేసావే’ ‘మనం’ చిత్రాల్లో వీరి రొమాన్స్ కోసం ప్రేక్షకులు క్యూలు కట్టారు. ముఖ్యంగా ప్రేమికులకు ఈ జంట మంచి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. వీరిద్దరూ పెళ్ళైన తరువాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కాబట్టి ‘మజిలీ’ చిత్రం మొదలైనప్పటి నుండీ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక సినిమా కి సంబందించిన టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రం విడుదలయ్యాక ఈ చిత్రం రాబట్టిన వసూళ్ళే ఇందుకు ఆధారం. అలా అని ఈ జంట విడి విడిగా నటించిన సినిమాలు ఈ రేంజ్లో రాణించవు.

‘మజిలీ’ చిత్రం దాదాపు 35 కోట్లు వసూల్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ‘మజిలీ’ ఇచ్చిన హిట్ తో మరో చిత్రంలో కలిసి నటించడానికి కూడా ఈ జంట రెడీ అవుతుందట. ‘ఆర్.ఎక్స్.100’ డైరెక్టర్ అజయ్ భూపతి ‘చైసామ్‌’ ఆల్రెడీ ఓ కథను వినిపించాడట. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. కథ నచ్చడంతో వీరిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని తెలుస్తుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన తొందర్లోనే రానుందని సమాచారం.

Share.