తమన్నాని పెళ్ళి చేసుకుంటానంటున్న శృతి హాసన్..!

సౌత్ ఇండియన్ టాప్ హీరోయినయిన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్ లో మాత్రం ఒకటి, రెండు సినిమాలు చేస్తూ ముందుకుసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచి యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఓ చిట్ చాట్ షోకి హాజరైంది శృతి హాసన్. ఈ షో లో ఆమెకు ఓ ప్రశ్న ఎదురయ్యింది. అదేంటంటే… ”ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్తారని” హోస్ట్ ప్రశ్నించాడు.

దీనికి శృతి హాసన్ ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. “నేను ఓ హీరోయిన్ తో డేటింగ్ చేయాల్సి వస్తే… అది తమన్నా తోనే… !” అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు ‘తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను అబ్బాయైతే.. తమన్నానే పెళ్ళి చేసుకునే దాన్ని…! తమన్నా చాలా మంచి అమ్మాయి”… అంటూ ‘ షాకింగ్ కామెంట్స్ చేసింది. స్వతహాగా తమన్నా, శృతి హాసన్ , కాజల్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ తమన్నా,శృతి హాసన్ ఇద్దరూ కలిసి చాలా పార్టీలకి హాజరవుతూ ఉంటారు. ఈ కారణంగానే శృతి హాసన్… ఇలా తమన్నా పేరు చెప్పి వారి స్నేహాన్ని మరోసారి ప్రేక్షకులకి తెలియజేసిందన్న మాట..!

Share.