నా రాజకీయ లబ్ధి కోసం పవర్ స్టార్ ను తిట్టాల్సిన అవసరం లేదు

సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలి లేదా జనాలు మన గురించి మాట్లాడుకోవాలి అని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కడు ఇమ్మీడియట్ గా చేసే పని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తిట్టడమే. ఆయన్ని తిట్టడానికి పెద్దగా కారణాలు ఎలాగూ ఉండవు కాబట్టి.. ఆయన సక్రమంగా చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి లేదా ఆయన చదువు గురించి తిట్టడం చేస్తుంటారు కొందరు పబ్లిసిటీ పిచ్చోళ్ళు. కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆ ఖాతాలోకే వస్తారు. కానీ.. నేను ఆ తరహా వ్యక్తిని కాదని చెబుతోంది మాధవీ లత. ఇప్పుడంటే ఆమె బీజేపీలో జాయినై పవన్ కళ్యాణ్ కి అపోనెంట్ గా మారింది కానీ.. నిజానికి ఆమె పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.

madhavi-latha-about-pawan-kalyan1

madhavi-latha-about-pawan-kalyan2

శ్రీరెడ్డి కావాలని పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టిన తరుణంలో పవన్ కి సపోర్ట్ గా ఫిలిమ్ ఛాంబర్ లో మౌన దీక్ష కూడా చేసింది. తాజాగా గుంటూరు నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్న మాధవీలత ఓ టీవీ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. “నేను పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ ను తిట్టే టైమ్ కాదు. జనసేనాని ఎప్పుడూ మోడీని తిట్టలేదు. అలాంటప్పుడు నేను ఆయన్ని ఎందుకు టార్గెట్ చేస్తాను” అని తన రాజకీయ ప్రణాళికల గురించి క్లారిటీ ఇచ్చింది. అలాగే.. తాను తప్పకుండా ఎమ్మేల్యేగా గెలుస్తాననే నమ్మకం వ్యక్తం చేసింది.

madhavi-latha-about-pawan-kalyan3

Share.