అఖిల్ 4 లో ఛాన్స్ కొట్టేసిన మహేష్ హీరోయిన్..?

అక్కినేని ఫ్యామిలిలో ఉన్న ఏకైక ఎనర్జిటిక్ హీరో అఖిల్ అనే చెప్పాలి. డాన్సులు, ఫైట్లలో దుమ్ము రేపుతాడు అనడంలో సందేహం లేదు. అయితే నటన విషయంలో అంత మెప్పించలేకపోతున్నాడు. అందుకే మూడు ప్లాపులు వచ్చి పడాయి. దీంతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే నాలుగవ సినిమాకి కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు అఖిల్ నాలుగవ సినిమా ఓకే అయ్యింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది.

ఇప్పటి వరకూ అఖిల్ సరసన కొత్త హీరోయిన్లే నటించారు. దీంతో ఆ హీరోయిన్లకి ప్లస్ అయ్యిందే తప్ప అఖిల్ కు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. కొత్త హీరోయిన్లు కాబట్టి పెద్దగా సినిమా పై క్రేజ్ ఏర్పడడానికి ఉపయోగపడలేదు. దీంతో చాలామంది నాయికల పేర్లను పరిశీలించారు. చివరికి కైరా అద్వాని అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది కైరా అద్వాని. ఆమెకు తెలుగులో కూడా చాలా క్రేజ్ ఉంది. ఈమెను తీసుకుంటే అఖిల్ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయమని నిర్మాత అల్లు అరవింద్ భావించి ఆమెనే ఫైనల్ చేశారట. కైరా తో పాటూ ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందట. ఇందుకోసం ఓ కొత్త భామని తీసుకున్నారని సమాచారం.

Share.