నరేష్ గారు మీ ప్రవర్తన నాకు నచ్చలేదు : హేమ

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలయ్యి ఇంకా 15 రోజులు కూడా కాలేదు అప్పుడే వివాదాలు మొదలయిపోయినట్టే కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్ ప్యానెల్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దమయ్యింది. ఇదిలా ఉండగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నరేష్ చర్యలు కొందరిని బాధ పెట్టాయి. ఆయన తన స్పీచ్ లో ‘నా’ అనే పదాలు వాడడం పై రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు.

అలాగే నటి హేమని కూడా స్టేజ్ పై అందరి ముందు అవమానించారు నరేష్. ప్రమాణ స్వీకారంలో భాగంగా ఉపాధ్యక్షురాలు అయిన నటి హేమ మాట్లాడుతుండగా.. అధ్యక్షుడు నరేష్ మైక్ లాగేసుకోవడం అందరినీ షాక్ కి గురిచేసిందని. దీంతో ఆమెకు మతిపోయినంత పని అయ్యింది. దీంతో అసలేం చేస్తున్నారంటూ మండిపడింది. ఇంతలో జీవిత, రాజశేఖర్ లు ఇన్వాల్వ్ అయ్యి హేమకి మైక్ ను అందజేశారు. మైక్ తీసుకున్న హేమ.. నరేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నరేష్ గారు మైక్ తీసుకోవడం బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన స్టేజ్ పై మాట్లాడిన మాటలు వారితో ముందుగా చర్చించలేదని, జనరల్ బాడీ మీటింగ్ లో కూర్చొని మాట్లాడిన తరువాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది హేమ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నరేష్ పై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.మరి ఈ విషయం పై నరేష్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..!

Share.