ఛాన్స్ ఇచ్చాడు కానీ.. రిలీజ్ కి ముందే కత్తిరించేశాడు!

షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అనంతరం సినిమాల్లోకి వచ్చి స్టార్ డమ్ సంపాదించుకొన్న ఓ యువ కథానాయకి ఇటీవల ఓ పెద్ద సినిమాలో అవకాశం అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో ఎప్పట్లానే డైరెక్టర్ తో క్లోజ్ గా వ్యవహరించడం మొదలెట్టిందట. డైరెక్టర్ కూడా రసికుడు కావడంతో మరో ఆలోచన లేకుండా ఆమెతో సత్సంబంధాలు కొనసాగించాడు. షూటింగ్ టైమ్ లో అమ్మడికి స్పెషల్ ట్రీట్ మెంట్ కూడా దొరికింది. అక్కడితో ఆగలేదు.. ఆమె కోసం స్క్రిప్ట్ లో చిన్నపాటి మార్పులు చేసి అమ్మడికి రెండుమూడు సీన్లు ఎక్కువగా రాశాడట. దాంతో ఆ సినిమాతో కెరీర్ గ్రాఫ్ మారిపోతుందని భావించిన ఆ హీరోయిన్ని ఆఖరి నిమిషంలో ఆమె ఊహించినంత దారుణంగా మోసం చేశాడట సదరు డైరెక్టర్.

ఎడిటింగ్ లో అమ్మడి సీన్లు చాలా కట్ చేసి పారేశాడట. దాంతో అప్పటివరకూ తన కెరీర్ గ్రాఫ్ ను మాచేస్తుందని కలలుగన్న సినిమా కాస్తా తన కెరీర్ కి మైనస్ అయ్యింది. పోనీ సినిమా పోతే పోయింది.. డైరెక్టర్ తో కాంటాక్ట్ అయినా ఉంది కదా అని సంబరపడేలోపు.. ఆ డైరెక్టర్ మన హీరోయిన్ని పట్టించుకోవడం మానేశాడట. దీనికితోడు అమ్మడి కొత్త సినిమా స్క్రీన్ ప్రెజన్స్ పుణ్యమా అని అప్పటివరకూ వచ్చిన సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. దాంతో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ కొట్టుమిట్టాడుతూ.. ఉన్నది పోయే ఉంచుకున్నదీ పోయే అని బాధపడుతోంది.

Share.