అందాల భామ మాత్రమే కాదు మనసున్న మారాణి

నిన్నటివరకూ బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఆలియా.. “ఆర్ ఆర్ ఆర్”లో రామ్ చరణ్ సరసన కథానాయికగా ఎంపిపై టాలీవుడ్ లోనూ త్వరలోనే తెరంగేట్రం ఇవ్వనుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఆమెను అందరూ ఒక గ్లామర్ డాళ్ లా మాత్రమే చేశారు. ఆ తర్వాత నటించే ప్రతి సినిమాలోనూ ఒక ఘాటైన చుంభనం ఇవ్వడం మొదలెట్టడంతో లేడీ ఇమ్రాన్ హష్మీ అని పిలవడం మొదలెట్టారు. ఇక జనరల్ నాలెడ్జ్ విషయంలో అమ్మడిని ఏరేంజ్ లో ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. “డియర్ జిందగీ, రాజీ, గల్లీ బోయ్” సినిమాల్లో అమ్మడి నటన చూసిన తర్వాత ఆమె గొప్ప నటి మాత్రమే కాదు భవిష్యత్ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అని కూడా తేల్చేశారు.

అయితే.. ఆలియా మంచి నటి మాత్రమే కాదని.. అంతకుమించిన మంచి మనసున్న మనిషి అని ఇటీవల ప్రూవ్ చేసుకుంది ఆలియా. తన పుట్టిన రోజు సందర్భంగా తన అసిస్టెంట్ మరియు డ్రైవర్ లు ఇద్దరికీ చెరో పాతిక లక్షల చెక్ లు ఇచ్చిందట. అప్పటికే వారిద్దరూ ఓ ఇల్లు కొనుక్కోవడం కోసం డబ్బులు కూడబెట్టుకుంటున్న విషయం తెలుసుకొన్న ఆలియా వారికి ఆర్ధిక సాయం అందించింది. ఈ విషయం మీడియాకి తెలియడంతో అందరూ ఆలియాను పొగడడం మొదలెట్టారు.

Share.