అభిమాని కాళ్ళు పట్టుకొన్న సూర్య!

ఇటీవల “అజ్ణాతవాసి” ఆడియో వేడుకలో ఓ అభిమాని వచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని మరీ ఆయనతో ఓ సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే.. ఆ విషయాన్ని కొందరు మెచ్చుకోగా, ఇంకొందరు మాత్రం ఆ కుర్రాడ్ని దుమ్మెత్తిపోశారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. “ఆ కుర్రాడు తన తల్లిదండ్రులకు కూడా ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసి ఉంటాడో లేదో తెలియదు కానీ.. ఇలా పబ్లిక్ గా తన ఫేవరెట్ హీరో కాళ్ళు పట్టుకొన్నాడు, రేపన్న రోజున ఈ వీడియో చూసుకొని అతడే సిగ్గుపడాల్సి వస్తుంది” అన్నవాళ్లు కూడా లేకపోలేదు, వాళ్ళన్న మాటలో నిజం కూడా లేకపోలేదు.

అయితే.. ఇదే తరహాలో ఇటీవల “గ్యాంగ్” ప్రీరిలీజ్ ఈవెంట్ తమిళనాడులో జరిగినప్పుడు సూర్య స్టేజ్ మీద మాట్లాడుతుండగా ఓ అభిమాని పరిగెట్టుకుంటూ వచ్చి అతడి కాళ్ళ మీద పడిపోయాడు. అక్కడున్నవాళ్ళందరూ “సూర్య ఆ కుర్రాడికి ఒక సెల్ఫీ ఇస్తాడు చూడు” అని ఫిక్స్ అవ్వగా.. సూర్య మాత్రం ఆ అభిమాని కాళ్ళకి దండం పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ అభిమాని కాళ్ళు మొక్కిన సూర్య సేట్జ్ పై మాట్లాడుతూ.. “ఇలా మా కాళ్ళు పట్టుకోవడం తప్పు” అని అభిమానులకు చెప్పడం అందరి హృదయాలని హత్తుకొంది. ఇకనైనా అభిమానులు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది.

Share.