నన్ను ప్రభత్వం అడ్డుకుంటుంది : మోహన్ బాబు

కలెక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్… శ్రీ విద్యానికేతన్ అధినేత అయిన మోహన్ బాబు ఇంటిని తాజాగా పోలీసులు చుట్టుముట్టారు. దీనికి ముఖ్య కారణం ‘ఫీజ్ రీఎంబెర్స్మెంట్’ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని… అందుకు నిరసన వహిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడానికి మోహన్ బాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు తిరుపతిలో ఉదయం 10గంటల నుండీ వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ఈ ర్యాలీని నిర్వహించాలని మోహన్ బాబు ప్లాన్ చేసారు.

cops-trying-to-house-arrest-mohan-babu1

అయితే ఈరోజు ‘ఎం.ఎల్.సి’ ఎలక్షన్లు జరుగుతుండడంతో… ఈ ర్యాలీ జరగకుండా ఆపాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 7గంటల నుండీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదుట భారీగా పొలిసు బలగాలను ఏర్పాటుచేశారు. అంతేకాదు మోహన్ బాబు ఇంటిని కూడా చుట్టు ముట్టి ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారని తాజా సమాచారం. ఇదిలా ఉంటే మోహన్ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ… ఈ ర్యాలీని కొసాగించి తీరుతానని… తమ నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం ఇలా ప్రయత్నిస్తుందని చెప్పుకొస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలు కూడా మోహన్ బాబుకి మద్దతు పలుకున్నారట. మరి ఈ తరుణంలో ఏం జరుగుతుందో చూడాలి.

Share.