ఆచారి అమెరికా యాత్ర మూవీ టీజర్ | విష్ణు మంచు | ప్రజ్ఞ జైస్వాల్

‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు మరియు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ విడుదల చేశారు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రాన్ని జనవరి 26 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Share.