డివైడ్ టాక్ తో కూడా బాగానే రాబట్టాడు!

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లోన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎబిసిడి’. మే 17 న (నిన్న) ఈ చిత్రం విడుదలైంది. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అనేది క్యాప్షన్. రాజీవ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించాడు. దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళం చిత్రం ‘ఎబిసిడి’ కు ఇది రీమేక్ కావడం విశేషం. శిరీష్ తొలిసారి కామెడీతో ఆకట్టుకోవడానికి ట్రై చేసాడు. ‘ఎబిసిడి’ కు మొదటి షో నుండే డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సురేష్ బాబు లాంటి బడా నిర్మాత ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే వేసవి సెలవులు ఉండడంతో మంచి కలెక్షన్స్ నే సాధించిందని చెప్పాలి .

మొదటి రోజు ‘ఎబిసిడి’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలూ కలిపి 2.25 కోట్ల షేర్ ను రాబట్టింది. మహేష్ ‘మహర్షి’ చిత్రం పోటీని తట్టుకుని కూడా శిరీష్ వసూళ్లను రాబట్టడం విశేషమే. ‘ఎబిసిడి’ చిత్రానికి 7 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.

Share.