90 ఎం.ఎల్ ఇది చాలా తక్కువ

తమిళ “బిగ్ బాస్” షో ద్వారా విశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న ఒవియా ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన చిత్రం “90 ఎం ఎల్”. తమిళ స్టార్ హీరో శింబు సంగీతం అందించడంతోపాటు గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి తెలుగు ప్రేక్షకులు ఈ అడల్ట్ ఎంటర్ టైనర్ ను ఏమేరకు ఎంజాయ్ చేస్తారో చూడండి.

90ml-movie-review1

కథ: రీటా (ఒవియా) ఒక మోడ్రన్ ఉమెన్. ప్రేమించినంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నమ్మే ఆమె.. ఆమెకు నచ్చిన వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటుంది. అదే అపార్ట్ మెంట్ లో ఉండే మరికొందరు మహిళలతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. ఒకానొక సందర్భంలో రీటా మరియు ఆమె స్నేహితులందరూ కలిసి మందు సిట్టింగ్ వేస్తారు. ఒక్కో పెగ్ (90 ఎం ఎల్)కి ఒక్కొక్కరూ తమ కథలు చెప్పుకోవడం మొదలెడతారు. అలా మొదలైన మందు సిట్టింగ్ వాళ్ళలో అణగదొక్కబడి ఉన్న ఎన్నో భావాలను బయటపెట్టేలా చేస్తుంది.

ఆ తర్వాత ఆ అయిదుగురు అమ్మాయిల ప్రయాణం ఎలా సాగింది? అనేది “90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ” కథాంశం.

90ml-movie-review2

నటీనటుల పనితీరు: బోల్డ్ ఉమెన్ రోల్లో ఒవియా చాలా బోల్డ్ గా నటించింది. ఆమె పాత్రకు నవతరం అమ్మాయిలు చాలామంది కనెక్ట్ అవుతారు. మసూమ్ శంకర్, మోనిషా రామ్, శ్రీ గోపిక, బొమ్ము లక్ష్మీ ఇలా అందరు పోషించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి.

శింబు గెస్ట్ రోల్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

90ml-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: ఇప్పటివరకూ మగాళ్లు తాగేసి ఆడవాళ్ళు పెట్టే కష్టాల గురించి మాట్లాడుకొనే సన్నివేశాలు చూసి నవ్వుకున్న జనాలకు.. ఆడవాళ్ళు తాగి మగవాళ్ళ కారణంగా వాళ్ళు పడే కష్టాల గురించి మాట్లాడుకొనే సన్నివేశాలను కాస్త బోల్డ్ గా చూపించడం వల్ల కొందరికి మింగుడుపడడం కష్టం కానీ.. అన్నీ నిజాల్లాగే కనిపిస్తాయి. చాలామంది మగాళ్లు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు తమకు తెలియకుండా చేసే చాలా తప్పుల్ని తెలుసుకొంటారు. అలాగే.. లెస్బియన్ రిలేషన్ షిప్ గురించి చాలా ఓపెన్ గా, స్ట్రయిట్ గా లేడీ డైరెక్టర్ అనిత ఊదీప్ వివరించిన విధానం కూడా బాగుంది. ఇందుకు దర్శకురాలు అనిత ఊదీప్ ను మెచ్చుకోవాల్సిందే.

శింబు సంగీతం కంటే.. నేపధ్య సంగీతం బాగుంది. అరవింద్ కృష్ణ కెమెరా వర్క్ నీట్ గా ఉంది. ఎడిటింగ్, డి.ఐ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకాస్త బాగుండేది. బూతులు కాస్త ఎక్కువయ్యాయి అనిపిస్తుంది కానీ.. ఇదివరకూ ఈ తరహా సినిమాలు చాలా వచ్చి ఉండడంతో ఆడవాళ్ళు బూతులు మాట్లాడడం కాస్తా ఇబ్బందిగా ఉంటుంది కానీ.. కొత్తగానూ ఉంటుంది.

క్రేజ్ కోసం అనవసరమైన బూతులు యాడ్ చేశారు కానీ.. ఈ సినిమా కథ, కథనం, క్యారెక్టర్స్ మరియు ఆ క్యారెక్టర్స్ పడే వేదన కొన్ని లక్షల మందికి కనెక్ట్ అయ్యే కంటెంట్. కాస్త సున్నితంగా డీల్ చేసి ఉంటే ఈ సినిమాకి ఇంకాస్త వైడర్ రీచ్ ఉండేది. ఈ సినిమాను అందరూ చూస్తారు.. కానీ చూశామని చెప్పుకోవడానికి ఇబ్బందిపడతారు. కానీ.. తప్పకుండా సినిమా చూసిన తర్వాత ఆలోచిస్తారు.

90ml-movie-review4

విశ్లేషణ: ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి పక్కన పెడితే.. “90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ” అనేది మంచి సినిమా మాత్రమే కాదు.. కుదిరితే అందరూ చూడాల్సిన సినిమా. కానీ.. కంటెంట్ ను తెరకెక్కించిన విధానం అందర్నీ అలరించడం కష్టం కాబట్టి చూసిన కొందర్ని మాత్రం తప్పకుండా ఆకట్టుకొనే సినిమా ఇది.

90ml-movie-review5

రేటింగ్: 2/5

Share.