ప్రారంభం అదిరినా… పూర్తికాని మూవీస్

సినిమా నిర్మాణం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు.. 24 క్రాఫ్టులకు చెందిన అనేకమంది ప్రతిభావంతులు కలిసి పనిచేస్తే తయారయ్యే శిల్పం. వీరిమధ్య సమన్వయం కుదరకపోతే సినిమా ఏ దశలోనైనా ఆగిపోతుంది. భారీ కాంబినేషన్లో మొదలయిన చిత్రాలకు కూడా ఈ సమస్య తప్పలేదు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోతే మరికొన్ని సెట్స్ మీదకు వెళ్లి కూడా పూర్తికాలేక పోయాయి. క్లాప్ కొట్టిన తర్వాత కనుమరుగైన చిత్రాలపై ఫోకస్…

అబు .. బాగ్దాద్ గజదొంగChiranjeeviఈ పేరు వింటేనే భారీతనం కనిపిస్తోంది. మెగాస్టార్ కోసం ఈ టైటిల్ ఫిక్స్ చేయగానే అందరూ ఆహా అన్నారు. భాషా చిత్రాన్ని డైరక్ట్ చేసిన సురేష్ కృష్ణ చిరుతో మాస్టర్ తీసి హిట్ అందుకున్నారు. తర్వాత ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఏమిజరిగిందో ఏమో తెలియదు గానీ ఆగిపోయింది.

మెరుపుMerupuమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మగధీర తర్వాత కాజల్ అగర్వాల్ తో కలిసి మరో మూవీ చేసేందుకు సిద్దమయ్యారు. ధరణి దర్వకత్వంలో మెరుపుగా ప్రారంభమైన ఈ మూవీ పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది. మెగాస్టార్ తొలి షాట్ కి క్లాప్ ఇచ్చారు. రెగ్యులర్ షూటింగ్ ట్రాక్ ఎక్కకముందే ఈ చిత్రం కథ ముగిసింది.

చిరు, వర్మ చిత్రంRam Gopal Varmaరామ్ గోపాల్ వర్మ 90 వ దశకంలో ఫుల్ ఫామ్లో ఉన్నారు. మెగాస్టార్ కూడా విజయాలతో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో చిరుని బాలీవుడ్ లోకి ఎంట్రీ చేయాలనీ వర్మ ప్రయత్నించారు. ఊర్మిళ, చిరంజీవి పై ఒక పాట కూడా చిత్రీకరించారు. ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. కారణాలు చెప్పడానికి ఎవరూ ఇష్టపడలేదు.

గోలీపురం రైల్వే స్టేషన్Venkateshగోదావరి కథలతో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన వంశీ, విక్టరీ వెంకటేష్ తో ఓ మూవీ ప్లాన్ చేశారు. గోలీపురం రైల్వే స్టేషన్ అంటూ టైటిల్ అనుకోవడమే కాదు.. వెంకటేష్ పై కొన్ని షాట్లు కూడా తీశారు. కానీ కొంతకాలానికి ఈ చిత్రం ఆగిపోయినట్లు తెలిసింది.

చెప్పాలని ఉందిCheppalanivundiమలయాళం లో హిట్ సాధించిన నీరమ్ చిత్రాన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి చెప్పాలని ఉంది అనే టైటిల్ తో ఏ ఎమ్ రత్నం సినిమా నిర్మించాలని అనుకున్నారు. డైరక్టర్ గా ఎస్.జె.సూర్యని, హీరోయిన్ గా అమీషా పటేల్ ని తీసుకున్నారు. పవన్, అమీషాలపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. అప్పటికే అదే కథతో నువ్వేకావాలి మూవీ రావడంతో “చెప్పాలని ఉంది” ని ఆపేశారు.

నర్తన శాలNarthanasalaమహా నటుడు నందమూరి తారకరావు నటించి, మెప్పించిన నర్తనశాల మూవీని నటసింహ బాలకృష్ణ రీమేక్ చేయాలనీ సంకల్పించారు. భారీ సెట్ వేసి కొన్నిరోజులు షూటింగ్ నిర్వహించారు. ఈ చిత్రంలో ద్రౌపది పాత్ర పోషించే సౌందర్య ప్రమాదంలో మరణించడంతో ఈ చిత్రం ఆగిపోయింది.

సత్యాగ్రాహిSatyagrahiఖుషి విజయం అనంతరం నిర్మాత ఏ ఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ తో మరో మూవీని చేయాలనీ అనుకున్నారు. గ్రాండ్ గా సత్యాగ్రాహి అనే టైటిల్ ని ప్రకటించారు. అందరినీ ఊరించిన ప్రాజక్ట్ ఊసెత్తే వారే లేకుండా పోయారు.

చిరు, సింగీతంChiranjeeviవైవిద్యకథలతో అద్భుతాలను సృష్టించే సింగీతం శ్రీనివాస్ రావు, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఓ చిత్రం చేశారు. ఈ మూవీ 40 శాతం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఔట్ ఫుట్ చిరుకి సంతృప్తి ఇవ్వకపోవడంతో ఈ చిత్రాన్ని మధ్యలోనే ఆపేసారు.

Share.