రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న స్టార్లు

అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో నటించాలని నటీనటులందరూ కోరుకుంటుంటారు. చిన్న పాత్రకైనా రెడీ చెప్పే హీరోలు చాలామందే ఉన్నారు. అది రాజమౌళి రేంజ్. అటువంటిది ఆయనే స్వయంగా పిలిచి అవకాశం ఇచ్చినా వద్దని చెప్పిన వారు కూడా ఉన్నారు. రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న స్టార్లపై ఫోకస్..

శ్రీదేవి (బాహుబలి – శివగామి)Srideviతెలుగువారి సత్తాని ప్రపంచానికి చాటిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించమని రాజమౌళి మొదట శ్రీదేవిని కోరారు. అయితే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఈ ప్రాజక్ట్ కి దూరమయ్యారు. ఆ పాత్రను రమ్యకృష్ణ దక్కించుకొని అభినందనలను, అవకాశాలను పొందింది.

మంచు లక్ష్మి (బాహుబలి – శివగామి )Manchu Lakshmiశివగామి పాత్రను శ్రీదేవి చేయనున్న తర్వాత ఆ ఆఫర్ మంచు లక్ష్మి వద్దకు వెళ్లింది. కానీ ప్రభాస్ కి తల్లిగా నటించడం ఇష్టం లేక రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ ని మంచు లక్ష్మి వదులుకుంది.

సూర్య (బాహుబలి)Suryaబాహుబలి సినిమాలో ఓ కీలక పాత్రకు ముందుగా తమిళ నటుడు సూర్యని జక్కన్న సంప్రదించారంట. అందుకు అయన ఒప్పుకోలేదు. ఈ విషయాన్నీ సికిందర్ ప్రమోషన్ సమయంలో సూర్య మీడియా ముఖంగా చెప్పుకున్నారు. ఆ ఛాన్స్ వదులుకున్నందుకు బాధపడ్డానని వెల్లడించారు.

వివేక్ ఒబెరాయ్ (బాహుబలి – భల్లాల దేవ)Vivek Oberoiబాహుబలి చిత్రంలో ప్రభాస్ కి సమానంగా పోటీపడిన నటుడు రానా. అతను పోషించిన భల్లాల దేవ పాత్రకు ముందుగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ని అడిగారు. అయితే అతను ఇతర ప్రాజక్ట్ ల్లో బిజీగా ఉండడంతో అఫర్ ని తిరస్కరించారు.

ప్రభాస్ (సింహాద్రి) Vivek Oberoiస్టూడెంట్ వన్ మూవీ తర్వాత సింహాద్రి కథను మొదట ప్రభాస్ కి వినిపించారంట. అయితే ఆ కథను హ్యాండిల్ చేయలేడేమోనని ప్రభాస్ రిజక్ట్ చేశారు. అదే కథను తెర మీద చూసుకొని రాజమౌళి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

అర్చన (మగధీర ) Archanaమగధీర సినిమాలో శ్రీహరి పోషించిన సల్మాన్ పాత్రకు భార్య గా సలోని నటించింది. అయితే నిడివి ఎక్కువ కావడం వల్ల ఆమె నటించిన సీన్స్ తొలిగించారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆ క్యారక్టర్ కి మొదట అర్చనని అడిగారు. కానీ చిన్న రోల్ అని ఒప్పుకోలేదు.

సోనమ్ కపూర్ (బాహుబలి – అవంతిక)Sonam Kapoorబాహుబలి సినిమాలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకు మొదట బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ని బాహుబలి బృందం అడిగింది. అయితే ఆ ఆఫర్ ని తిరస్కరించింది. ఎందుకు వదులుకుందో కారణం మాత్రం చెప్పలేదు కానీ.. సోనమ్ కపూర్ వద్దన్న తర్వాత తమన్నా ఒకే చెప్పింది.

Share.