4 లెటర్స్

అందరూ కొత్త నటీనటులు మరియు సాంకేతిక నిపుణులతో తెరకెక్కించియాబడిన చిత్రం “4 లెటర్స్”. ట్రైలర్, పాటలు పెద్దగా ఆకట్టుకొనే విధంగా లేకపోయినా.. సినిమా ప్రమోషన్స్ గట్టిగా ఉండడం, “ఎన్టీఆర్ మహానాయకుడు” లాంటి సినిమాకి పోటీగా థియేటర్లు కూడా దక్కించుకోవడంతో కాస్త ఆసక్తి మొదలైంది. మరి సినిమా సంగతేంటి అనేది చూద్దాం..!!
4latters-movie-telugu-review1

కథ: బాగా బలిసిన ఒక రిచ్ ఫాదర్ కి ఏకైక కొడుకు అజయ్ (ఈశ్వర్) అపారమైన సంపద కలిగి ఉండడమే కాదు.. అపర మేధావి కూడా. కాలేజ్ లో లెక్చరర్లకు కూడా క్లాసులు పీకుతుంటాడు. మొదట ఒకమ్మాయి అంజలి (టువా చౌదరి) పరిచయమవుతుంది. ఆమెతో కొన్నాళ్ళ ప్రేమ వ్యవహారం నడిపిన తర్వాత ఆమెతో బ్రేకప్ అవుతుంది. తర్వాత ఈశ్వర్ మరో అమ్మాయి అనుపమ (అంకిత)ను కలుస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది.
ఈ రెండో ప్రేమ కథ ఎక్కడివరకూ సాగింది అనేది “4 లెటర్స్” కథాంశం.
4latters-movie-telugu-review2

నటీనటుల పనితీరు: పోసాని లాంటి సీనియర్ ఆర్టిస్ట్ చేత కూడా చెత్త యాక్టింగ్ చేయించవచ్చని ప్రూవ్ చేసిన సినిమా ఇది. అన్నపూర్ణమ్మ లాంటి సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేత కూడా డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించిన ఘనత ఈ దర్శకుడికే చెందుతుంది.

ఇక చిత్ర కథానాయకుడు ఈశ్వర్ నత్తితో చెప్పే డైలాగులు, ఆ డైలాగులు చెబుతూ హావభావాలు ప్రకటించడంకోసం పడే కష్టం మామూలుగా ఉండదు.

ఇక హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేయడం కోసం పోటీపడ్డారు. కానీ.. అంకిత అతి చిన్న బట్టలు వేసుకొని పోటీలో గెలిచింది అనుకోండి. కానీ.. వాళ్ళ పొట్టి బట్టలు, బూతు డైలాగులు, హేయమైన ఎక్స్ పోజింగ్ ఏదీ కూడా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయలేదు.
4latters-movie-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు: పాటల్లో డబుల్ మీనింగ్ అనేది సరదాగా ఉండాలి కానీ అసహ్యంగా ఉండకూడదు అనే మినిమమ్ సెన్స్ కూడా దర్శకుడికి లేకపోవడంతో.. ప్రతి పాట బూతు స్తోత్రంలా వినిపిస్తుంది. ఇక కెమెరా యాంగిల్స్ అయితే.. హీరోయిన్ తొడల మధ్యలోకి కూడా వెళ్లిపోవడం గమనార్హం. ఛాన్స్ ఇవ్వాలే కానీ.. ఆ కెమెరా ఇంకెక్కడ పెట్టేవాడో. కొన్ని ఫ్రేమ్స్ చూస్తే ఆర్జీవి హీరోయిన్స్ ను చూపించే పద్ధతి చాలా బెటర్ అనిపించింది.

90ల కాలంలో బీగ్రేడ్ సినిమాలుండేవి. షకీలా, జయలలిత, రేష్మీ లాంటి మల్లు భామలతో సెక్స్ జోక్స్ తో కొన్ని సినిమాలు వచ్చేవి. 2000 తర్వాత ఆ బీగ్రేడ్ తరహా కథాంశాలను కొన్ని సినిమాల్లో కామెడీ ట్రాక్స్ కింద వాడేవారు. ఈమధ్యకాలంలో ఆ తరహా కథాంశాలు కానీ సినిమాలు కానీ కనిపించలేదు. ఆ లోటు “4 లెటర్స్” చిత్రంతో తీరిపోయింది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే.. ఇంత నీచంగా ఎలా రాస్తార్రా బాబు అనిపిస్తే.. ఇంకొన్ని విని చెవులు మూసుకుని థియేటర్ నుంచి పారిపోవాలి అనిపిస్తుంది.

4latters-movie-telugu-review4

విశ్లేషణ: యూట్యూబ్ లో ఫ్రీగా చూడాల్సిన అవసరం లేని బీగ్రేడ్ సినిమా “4 లెటర్స్”. ఈ తరహా కథలతో హేయమైన సినిమాలు తీసేబదులు.. షార్ట్ ఫిలిమ్స్ ను ప్రొడ్యూస్ చేసి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం చాలా బెటర్.
4latters-movie-telugu-review5రేటింగ్: 0/5

Share.