ట్రైలర్ తో అదరహో అనిపించి.. నిరాశపరిచిన సినిమాలు

‘పేరు గొప్ప… ఊరు దిబ్బ’ అన్నట్టు… 2018 సంవత్సరం టాలీవుడ్ లో విడుదలైన ఎన్నో చిత్రాల ట్రైలర్స్ చూసి… థియేటర్లకు పరుగులు తీసిన జనాలకు.. అదే థియేటర్లోనుండీ పారిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ట్రైలర్ చూడగానే సగటు ప్రేక్షకుడు.. ‘అబ్బా ఏముంది రా.. ఈ ట్రైలర్..! ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. కచ్చితంగా ఈ సినిమా చూసి తీరాల్సిందే అని నమ్మిన ప్రేక్షకుడిని నిలువునా మోసం చేస్తున్నారు.. ఆ ట్రైలర్ కట్ చేస్తున్నారు.. ఆ చిత్ర యూనిట్ సభ్యలు ..!
ఇలా చూసి మోస పోయి.. బుక్కయిపోయిన ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అలా మోసం చేసిన కొన్ని ట్రైలర్స్ పై ఓ లుక్కేద్దాం రండి.

1. అజ్ఞాతవాసి :

ఇది మనం కూర్చునే కుర్చీ, వయోలెన్స్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్, వీడి చర్యలు ఊహా అతీతం వర్మా.. అంటూ వచ్చిన ఈ త్రివిక్రమ్ మార్క్ ట్రైలర్ చుసిన వారెవరైనా.. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అనుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదు. అయ్యో త్రివిక్రమ్ ఎంత పని చేశావయ్యా..!

2. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా :

ఇండియా కావాలి ఇచ్చేయి.. అంటూ ఎండ్ అయ్యే ఈ గూస్ బంప్స్ అండ్ పవర్ ప్యాకెడ్ ట్రైలర్ చూసాక.. ఎవరైనా ఏం అనుకుంటారు…? బన్నీకి ఇంకో హిట్ పడటం ఖాయం అనుకుంటారు. కానీ కట్ చేస్తే డిజాస్టర్ అయ్యింది.

3. శైలజా రెడ్డి అల్లుడు

చేయ్ లవర్ బాయ్ ఇమేజ్, వెన్నెల కిషోర్, పృథ్వీ,రమ్యకృష్ణ, ట్రైలర్లో చెప్పే కామెడీ వన్ లైనెర్స్ చూసి.. మరీతీ.. ఈజ్ బ్యాక్ అనుకున్నారు అంతా..! కానీ ఈ ఫార్ములా అనుకున్నంత వర్కౌట్ కాలేదు..!

4. నోటా :


ఈ బై లింగ్యువల్ ట్రైలర్ చూసాక.. ఎవరైనా మంచి పొలిటికల్ థ్రిల్లర్ అనుకుంటారు. కానీ అంతగా థ్రిల్ చేయలేదు, రిజల్ట్ .. రౌడీ కి డిజాస్టర్.

5. వీర భోగ వసంత రాయలు

ప్రామిస్ భయ్యా..! ట్రైలర్ చూసి.. కంటెంట్ ను ఎంకరేజ్ చేసే ముగ్గురు హీరోలు ఉన్నారు కదా.. ఏదో ఉంటుంది.. ఈ మూవీ రెగ్యులర్ మూవీ అయితే కాదు.. అనుకున్న వారిలో నేను ఒకడిని.., ఇంటరెస్ట్ గా స్టార్ట్ అయ్యే ఈ సినిమా… కొన్ని లాజిక్ లెస్ సీన్స్ తో ‘బోర్ డం’ గా మిగిలిపోయింది.

6. సవ్యసాచి

టైటిల్ వింటేనే చాలా కొత్తగా ఉంది.. పైగా మాధవన్ విలన్.. అందులోనూ … ‘లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్’ కాన్సెప్ట్ కాబట్టి.. నేనేంటి..? ఎవరైనా ఇంట్రెస్టింగ్ మూవీ అనుకుంటారు. కానీ సినిమాలో ఆ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ చందూ మొండేటి ఫెయిల్ అయ్యాడు.

7. అమర్ అక్బర్ ఆంటోనీ

శ్రీనువైట్ల – రవితేజ కాంబినేషన్ ఈజ్ బ్యాక్, దానికి తోడు ‘మైత్రి మూవీ మేకర్స్’ లాంటి సూపర్ హిట్ బ్యానర్, అందులోనూ ఇలియానా రీ -ఎంట్రీ, సునీల్ టాలీవుడ్ కమెడియన్ ఈజ్ బ్యాక్, ఇన్ని కలిసిన ట్రైలర్ ఫుల్ మీల్స్… కానీ సినిమా మాత్రం కాదండోయ్..!

8. అంతరిక్షం :

టాలీవుడ్ ఫస్ట్ స్పేస్ మూవీ, ఆ ఇంట్రెస్టింగ్ ట్రైలర్లో ఉన్న జీరో గ్రావిటీ షాట్స్.. థియేటర్లో చూసిన ఆడియన్స్ కి మాత్రం… అరే.. అంత ఎఫెక్టివ్ గా లేదే.. అనిపిస్తుంది. కథ పూర్తిగా మైనస్.. కానీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ప్రయత్నానికి మాత్రం హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

9. పడి పడి లేచె మనసు

లవ్ స్టోరీస్ ఇష్టపడే వారు ఎవరైనా హనూ రాఘవపూడి పొయెటిక్ టచ్ ఉన్న ట్రైలర్ కి ఫిదా అయిపోతారు. కానీ ఈ మూవీ చూసాక వచ్చే ఫీలింగ్ ఏంటి అంటే..’ ఆ ల్యాగ్ ఏంట్రా బాబు’, అందులోనూ మంచి సాంగ్స్ గురించి అయినా.. మూవీ ఆడాల్సింది అనుకుంటాం.. కానీ ఫుల్ గా డిజప్పాయింట్ చేసింది.

10. మెహబూబా

ఏదో మరిసిపోయానే అనుకున్నా.. ఇప్పుడు గుర్తొచ్చింది… ‘మెహబూబా’. ఈ సినిమా ట్రైలర్ లో ఇండో-పాక్ మధ్య వచ్చే విజువల్స్, అండ్ చివర్లో ఆకాష్ పూరి చెప్పే మెహబూబా జిందాబాద్ డైలాగ్ విని చాలా ఎక్స్ పెక్ట్ చేస్తాం.. కానీ ఫుల్ గా డిజప్పాయింట్ చేసింది.

11. కృష్ణార్జున యుద్ధం

నేచురల్ స్టార్ నాని డబుల్ రోల్ చేసిన ఈ మూవీలో.. నాని తన పాత్రలకి న్యాయం చేసాడు. పెర్ఫార్మన్స్ సూపర్ గా ఉన్నా.. కంటెంట్ సరిగా లేకపోతే మూవీ ప్లాప్ అవుతుంది… అనడానికి ఈ చిత్రం పెద్ద ఉదాహరణ అని చెప్పడంలో సందేహం లేదు.

Share.