అబ్బురపరిచిన శంకర్ గ్రాఫికల్ విజన్!

పరిచయం అవసరం లేని దర్శకదిగ్గజం శంకర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. కొన్ని ఎమోషనల్ గా జనాల్ని మోటివేట్ చేస్తే ఇంకొన్ని భయపెట్టాయి, మరికొన్ని సాంకేతికంగా అబ్బురపరిచాయి. అలా టెక్నాలజీ పరంగా ప్రేక్షకుల్ని విశేషమైన రీతిలో ఆశ్చర్యపరిచిన చిత్రం “రోబో”. రజనీకాంత్ టైటిల్ పాత్రలో రూపొందిన ఆ చిత్రం అప్పటి రికార్డులను చెల్లాచదురు చేసింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం “2.0”.robo-2-movie-trailer-review1

గతేడాది విడుదలవ్వాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ కారణంగా వాయిదాపడుతూ ఎట్టకేలకు నవంబర్ 29న విడుదలవ్వడానికి రంగం సిద్ధం చేసుకొంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు. టీజర్ కు మించిన టెక్నికల్ వండర్ గా ట్రైలర్ ఉండడం విశేషం.robo-2-movie-trailer-review2

ట్రైలర్ లో కనిపించే షాట్స్ అన్నీ వి.ఎఫ్.ఎక్స్ వే కావడం విశేషం. అన్నిటికంటే ముఖ్యంగా.. చివర్లో అక్షయ్ కుమార్ కూడా రజనీకాంత్ లా కనిపించే షాట్ భలే ఉంది. ఇక రోబోగా రజనీ చేసే ఫీట్లు వెండితెరపై చూడ్డానికి అద్భుతంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా.. సెల్ ఫోన్స్ తో అక్షయ్ కుమార్ చేసే రచ్చ ట్రైలర్ లో చూడ్డానికే భయానకంగా ఉంది, ఇక వెండితెరపై గగుర్పాటుకు గురి చేయడం ఖాయం.robo-2-movie-trailer-review3

ఇక ఫస్ట్ పార్ట్ లో కేవలం ఒక జెయింట్ రోబోను చూశాం.. ఈ సినిమాలో రెండు జెయింట్ రోబోస్ ఫైట్ ఉండబోతోందని ట్రైలర్ లో గ్లిమ్ప్స్ ఇచ్చాడు శంకర్. దాదాపు రెండేళ్లపాటు కేవలం గ్రాఫిక్స్ కోసం పడిన కష్టం ట్రైలర్ లో బాగా కనిపిస్తోంది. చూస్తుంటే.. నవంబర్ 29న రజనీకాంత్ & శంకర్ కాంబో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టేలా ఉన్నారు.

Share.