రొమాంటిక్ “15 డేస్ లవ్” షార్ట్ ఫిలిం

ప్రేమ… దీని గురించి స్పష్టమైన ఫార్ములా న్యూటన్ కూడా కనిపెట్టలేడేమో. ఎందుకంటే ప్రేమ పుట్టాలంటే ఎంత సమయం పడుతుంది? ఎవరి మధ్య ప్రేమ పుట్టడానికి ఆస్కారం ఉంది? ఏ అర్హతలు ఉండాలి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు జంట జంటకు మారిపోతుంటాయి.

అలా 15 రోజుల్లో ప్రేమలో మునిగిపోయిన ఓ ప్రేమ కథని  “15 డేస్ లవ్ ” అనే పేరుతో జయ కిషోర్ అద్భుతమైన షార్ట్ ఫిలిం తీశారు. ప్రేమికులుగా సన్నీ, రోహిణి చక్కగా నటించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా న్యాచురల్ గా వచ్చాయి. జై ఇచ్చిన సంగీతం లఘు చిత్రానికి ప్లస్ అయింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.