రికార్డుల బ్రేకర్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’

ఘట్టమనేని వారసుడు, టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ లో రికార్డులను తిరగ రాస్తున్నారు. తన కలక్షన్ రికార్డ్ లను తానే బీట్ చేస్తూ నంబర్ వన్ సింహాసనం ఫై ధీమా గా కూర్చొని ఉన్నారు.

రాజకుమారుడు rajakumaruduరాజకుమారుడు (1999) చిత్రంలో రాజాగా కనిపించి అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారారు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ విజయాన్ని సాధించింది. తొలి సినిమా తోనే కమర్షియల్ హీరో అనిపించుకున్నారు.

మురారి murariఫ్యామిలీ మొత్తాన్ని మహేష్ తన అభిమానులుగా చేసుకున్న చిత్రం మురారి. 2001 లో వచ్చిన మూవీలో మహేష్ అన్ని రకాల షేడ్స్ ని చూపించారు. సెంటిమెంట్ సీన్ లలో చక్కగా నటించి .. రాబోయే కాలంలో తనదే నంబర్ వన్ స్థానం అని సూచించారు.

ఒక్కడుokkadu2003లో రిలీజ్ అయిన ఒక్కడుతో కలక్షన్ల వర్షం కురిపించారు. కబడ్డీ ప్లేయర్ గా, లవర్ ని సొంతం చేసుకునే యువకుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు రాబట్టింది. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డ్ లు చెరిగిపోయాయి. ప్రిన్స్ తొలి సారి నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు.

అతడు athadu2005లో అతడు తో దిమ్మ దిరేగేలా చేశాడు. నంద గోపాల్, పార్ధు గా మహేష్ నటనను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేక పోయారు. పక్కా ప్రొఫిషనల్ కిల్లర్ గా రికార్డులన్నింటినీ మర్డర్ చేశారు.

పోకిరి pokiriఅండర్ కవర్ పోలీస్ గా మహేష్ చేసిన యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పోకిరి సినిమా తో తెలుగు సినిమాలు 50 కోట్ల మార్క్ ను దాటగలదని చూపించారు. అనధికారంగా 70 కోట్లు వసూల్ చేసిందని టాక్. తెలుగు సినిమా ఇన్ని కోట్లు రాబట్ట గలదా? అని సినీ పండితులు ఆశ్చర్య పోయారు.

ఖలేజా khalejaమాటల మాంత్రికుడితో మహేష్ చేసిన మరో సినిమా ఖలేజ. అతడులో మహేష్ ని సీరియస్ గా చూపించిన త్రివిక్రమ్ .. ఈ సినిమాలో అతడితో కామెడీ చేయించారు. మహేష్ కామెడీ టైం ఇందులో అదిరిపోతుంది. ప్రతి మాట పంచ్ లాగే ఉంటుంది. మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

దూకుడుdookuduపవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. తండ్రికి మంచి కొడుకిగా.. ఆయన కోసం ఒక రాజకీయ నాయకుడుగా, మరో వైపు ప్రియుడిగా ఒకే సినిమాలో నాలుగు షేడ్స్ ని అద్భుతంగా పలికించారు. దీంతో దూకుడు దూసుకు పోయింది. ఈ చిత్రం తో భారీ వసూళ్లు రాబట్టి నంబర్ వన్ కుర్చీలో మహేష్ ధీమాగా సెటిల్ అయిపోయారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుseethamma-vaakitlo-sirimalle-chettuతెలుగు సూపర్ స్టార్ అయి ఉండి ఎటువంటి భేషజాలకు పోకుండా వెంకటేష్ తో కలిసి స్క్రీన్ ని పంచుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) చిత్రంలో చిన్నోడుగా సింపుల్ గా కనిపించి 50 కోట్లను దాటించేసారు.

శ్రీమంతుడు srimanthuduఊరిని దత్తత తీసుకునే మంచి కాన్సెప్ట్ తో వచ్చిన “శ్రీమంతుడు” సినిమా మహేష్ అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రం ఏకంగా రూ. 175 కోట్లు వసూలు చేసింది. మహేష్ “శ్రీమంతుడు”తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చూపించారు.

బ్రహ్మోత్సవం brahmostavamశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో భారీ తారాగణం తో రూపుదిద్దుకున్న బ్రహ్మోత్సవం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12.71 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 18.8 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది.

స్పైడర్ spyderసూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కలయికలో రూపుదిద్దుకున్న స్పైడర్ మూవీని ఓవర్సీస్ లో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ సృష్టించింది. అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా స్పైడర్ ఎనిమిది లక్షల డాలర్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి.

భరత్ అను నేను bharat-ane-nenuకొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి చేసిన భరత్ అను నేను మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 200 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డుల రారాజు మహేష్ బాబు అని మరోసారి నిరూపించింది.

భారీ హిట్ తర్వాత భారీగానే అంచనాలు ఉంటాయి . ఆ అంచనాలకు మించి ఉండాలని వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మహేష్ కెరీర్ లో కీలకమైంది. హీరోగా 25 వ చిత్రం కావడంతో కొత్త లుక్ తో మహేష్ అదరగొడుతున్నారు. ఏప్రిల్ 5 న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.maharshi

Share.