నివేతా థామస్ రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

తాజా జెంటిల్ మాన్ సినిమాలో నాని తర్వాత ఎక్కువ మార్కులు కొట్టేసిన నటి నివేతా థామస్. ఆమె నానితో పోటీ పడి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాను స్కిన్ షోకు దూరమని స్పష్టంగా చెబుతున్నా ఈ భామను సంప్రదిస్తున్న నిర్మాతల జాబితా పెద్దదిగానే ఉంది. ఇంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీల్, రియల్ లైఫ్ సీక్రెట్స్ మీకందిస్తున్నాం.

  • నివేతా తల్లిదండ్రులు కేరళ వాసులు. తల్లి పేరు ఇల్లీ థామస్, తండ్రి షాజు థామస్. చెన్నైలో స్థిరపడ్డారు. అందుకే విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే జరిగింది. ప్రస్తుతం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్ ఫైనల్ ఇయర్ చేస్తోంది.Nivetha Thomas, Nivetha Thomas Facts
  • ఎనిమిదేళ్ళ వయసులోనే నివేతా సినిమాల్లో నటించింది. “ఉత్తర” అనే మలయాళీ చిత్రంలో బాల్యనటిగా పేరు తెచ్చుకుంది. అదే ఏడాది రిలాక్స్ అనే మూవీలోనూ యాక్ట్ చేసింది.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
  • స్కూల్ ల్లో మంచి స్టూడెంట్ గా పేరు తెచ్చుకుంటూ .. తమిళ సీరియల్లో నటించింది. చిన్నారి నివేతా రాజా రాజేశ్వరి, మై డియర్ భూతం, శివమయం ధారావాహికల్లో చేసింది.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
  • టీనేజ్ లోకి అడుగు పెట్టినప్పుడే నివేతా మంచి పాత్ర చేసింది.13 ఏళ్ల కూతురిగా “వేరుతే ఓరు భార్య”లో నటించి మలయాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ యువ నటి అవార్డు అందుకుంది.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
  • సినిమాల్లో నటిస్తున్నాం కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నివేతా ఎప్పుడూ అనుకోలేదు. నచ్చిన ఆహారాన్ని కడుపునిండా తినేది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఫుడ్ విషయంలో కాంప్ర మైజ్ కాలేదు.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
  • నివేతాకు బుద్ధిగా పాఠాలు వినడమే కాదు… చెప్పడమన్నా ఇష్టమే. నటన వైపు రాకుండా ఉంటే లెక్చరర్ అయ్యేది.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
  • నటుల్లో కమల్ హాసన్ అంటే నివేతాకు చాలా అభిమానం. ఎక్కువగా ఆయన సినిమాలు చూస్తుంటుంది. తమిళ్ “పాప నాశం” చిత్రంలో కమల్ కి కూతురిగా నటించింది.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
  • నివేతకు పబ్ లకు వెళ్లడమంటే నచ్చదు. పార్టీలకు వెళుతుంది. కానీ కాక్ టైల్స్, మాక్ టైల్స్ ను ముట్టదు. బీచ్ పార్టీలంటే ఇష్టం.
    Nivetha Thomas 8
  • నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంది. యాచకురాలిగా, మల్టీ షేడ్స్ ఉన్న సైకోగా, డీ గ్లామరైజ్ పాత్రల కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
  • ఇల్లు, స్కూల్, షూటింగ్… ఇదే నివేతా లోకం. కొందరే స్నేహితులున్నారు. ఆమెకు తమ్ముడు, తల్లి దండ్రులే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాని, శ్రీని ఫ్రెండ్స్ అయ్యారు.
    Nivetha Thomas, Nivetha Thomas Facts
Share.