మణిశర్మ అద్భుత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచు తునకలు ఇవే

తెలుగు చిత్ర పరిశ్రమలోని సంగీతదర్శకుల గురించి ఒక పుస్తకం రాస్తే.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి రెండు పేజీలు ఎక్కువగానే రాయాల్సి ఉంటాయి. ఆయన అందించిన ఆల్బమ్స్ అటువంటివి. చూడాలనివుంది, ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి, అతడు, పోకిరి.. వంటి ఎన్నో హిట్స్ అతని కీ బోర్డ్స్ నుంచి వచ్చినవే. మణిశర్మ సందర్భానుసారం ట్యూన్స్ ఇవ్వడమే కాదు.. సన్నివేశానికి సరిపడే నేపథ్యసంగీతాన్ని ఇవ్వడంలో నేర్పరి. అతని ఆర్ ఆర్ ప్రత్యేకత తెలిసే.. కొత్త మ్యూజిక్ డైరక్టర్ తో పాటలు తీసుకున్నప్పటికీ.. మణిశర్మ చేత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పించుకుంటున్నారు. అవి చాలు నేపథ్య సంగీతానికి రారాజు మణిశర్మ అని చెప్పుకోవడానికి. కేవలం మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాలపై ఫోకస్..

1. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

2. టెంపర్

3. హైపర్


4. టచ్ చేసి చూడు

5. అఖిల్

6. ఓ మై ఫ్రెండ్

7. కొంచెం ఇష్టం కొంచెం కష్టం

8. లక్ష్మి

9. చింతకాయల రవి

10. ఒంగోలు గిత్త

మంచి సన్నివేశానికి మణిశర్మ ఆర్ఆర్ తోడైతే ఎలా ఉంటుందో.. ఈ సినిమాలోని సన్నివేశాలు స్పష్టంచేశాయి. ఇప్పుడు నాగార్జున, నాని మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్ కి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పాటల కోసమే కాదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కూడా సంగీత ప్రియులు క్యూ కడుతారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Share.